ఇంజనీరింగ్ నిపుణులతో సీఎం జగన్‌ భేటీ

Update: 2019-06-22 05:02 GMT

 ఇంజనీరింగ్ నిపుణులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో సమావేశం అయ్యారు.  ఈ సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుల పరిస్థితిపై నిపుణులతో సీఎం చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అంచనాలను పెంచారని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ తరహా ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ పూర్తి స్థాయిలో సమీక్షించనుంది. ఇరిగేషన్, సీఆర్డీయే, పంచాయతీరాజ్ శాఖల్లో సుమారు 20వేల కోట్ల రూపాయల అంచనాలతో ఆమోదం పొందిన ప్రాజెక్టులను కమిటీ సమీక్షించనుంది. 

Tags:    

Similar News