Chandrababu: రైతుల ఉద్యమ ఫలితంగానే నేడు పరిపాలన భవనం ప్రారంభమైంది
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభించారు.
Chandrababu: రైతుల ఉద్యమ ఫలితంగానే నేడు పరిపాలన భవనం ప్రారంభమైంది
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీకీ రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధాని కావాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. విజయవాడ - గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని.. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారుచేశామన్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు అవసరం కాగా.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెప్పారు. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన చరిత్ర అమరావతి రైతులది హర్షం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభానికి ముఖ్య కారకులు రాజధాని రైతులని వారి ఉద్యమ ఫలితంగానే నేడు పరిపాలన భవనం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.