Arani Srinivasulu: జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

Arani Srinivasulu: పవన్‌ను కలవడంతో ఆరణి శ్రీనివాసులును.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్టానం

Update: 2024-03-03 11:57 GMT

Arani Srinivasulu: జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

Arani Srinivasulu: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవడంతో ఏపీలో ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనవైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. దీంతో ఆయన త్వరలోనే జనసేనలో చేరే అవకాశాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకు వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తామని కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్న ఆరణి శ్రీనివాసులు.. జనసేన నుంచి రాజంపేట ఎంపీ స్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News