Chandrababu: ఇవాళ ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
Chandrababu: కనిగిరిలో ఇవాళ, రేపు టీడీపీ అధినేత టూర్
Chandrababu: ఇవాళ ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
Chandrababu: ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. ఇక అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ పోరాటం స్టార్ట్ చేసింది. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలనే టార్గెట్‌తో వ్యూహాలను ముమ్మరం చేసింది సైకిల్ పార్టీ. ఇందులో భాగంగానే పర్యటనలకు శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. రా కదలి రా పేరిట ఇవాళ బహిరంగ సభ నిర్వహిస్తోంది టీడీపీ. ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సభకు వెలుగొండ సాధన ప్రాంగణంగా నామకరణం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన సభాస్థలికి చేరుకుంటారు. ఇక సభ అనంతరం చంద్రబాబు కనిగిరిలోనే బస చేయనున్నారు.
2024లో జరగబోయే ఎన్నికల మొదటి శంఖారావ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అయ్యారు. లక్ష మందితో సభ నిర్వహించేందుకు టీడీపీ క్యాడర్ అన్ని ఏర్పాట్లు చేసింది. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలో మహానాడుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎన్నికల శంఖారావ బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు టీడీపీ నేతలు.