మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నవంబర్ లో మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించేందుకు 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో పర్యటిస్తారని.. ఈ సందర్బంగా ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరగనుందన్నారు. నియోజకవర్గాల వారిగా ఆయా నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని, నాయకులందరూ తప్పక హాజరుకావాలని పార్థసారథి కోరారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, టీడీపీ నేతలు రొద్దం నరసింహులు, సంజీవరెడ్డి, సుబ్బరత్నమ్మ, నరేష్ పాల్గొన్నారు.