నేడు ఉరవకొండలో టీడీపీ రా..కదలిరా సభ.. హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు
Chandrababu: రేపు నెల్లూరు, కర్నూలు పత్తికొండలో బహిరంగ సభలు
నేడు ఉరవకొండలో టీడీపీ రా..కదలిరా సభ.. హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు
Chandrababu: రా..కదలిరా.. పేరుతో నేడు ఉరవకొండ శివారులో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రా.. కదలిరా పేరుతో ఒక బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా ఉరవకొండలో నిర్వహించనున్న బహిరంగసభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయడు పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి ఉరవకొండలోనే బస చేయనున్న చంద్రబాబు..రేపు నెల్లూరు, కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగి బహిరంగ సభలలో పాల్గొననున్నారు.