Chandrababu: వెంటనే పింఛన్లు ఇవ్వాలి.. సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌

Chandrababu: పెన్షన్ల పంపిణీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది

Update: 2024-04-02 07:21 GMT

Chandrababu: వెంటనే పింఛన్లు ఇవ్వాలి.. సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌

Chandrababu: ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని.. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాల్సిన అవసరముందన్నారు చంద్రబాబు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పంపిణీ చేపట్టాలని ఆయన కోరారు.

సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది చేత పెన్షన్లు పంపిణీ చేపట్టాలని కోరారు. అటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాతో కూడా ఫోన్‌లో మాట్లాడారు చంద్రబాబు. పెన్షన్ల విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేలా.. ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పెన్షన్ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు చంద్రబాబు.

Tags:    

Similar News