Chandrababu Naidu News: చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది
chandrababu naidu convoy met with accident in telangana choutuppal
Chandrababu Naidu News: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. సడెన్ బ్రేక్ కారణంగా కాన్వాయ్ లో ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొంది.
అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలవడంతో మరో వాహనంలో వారిని తరలించారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తుండగా..శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.