Perni Nani: వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు
Perni Nani: పేదలకు మేలు చేసేందుకు జగన్ వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు
Perni Nani: వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు
Perni Nani: ఏపీలో కూటమి పార్టీ నేతలైన చంద్రబాబు, పురందేశ్వరి, పవన్‌కల్యాణ్ నీచ రాజకీయాలకు తెరతీశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. పేదలకు మేలు చేసేందుకు సీఎం జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని విమర్శించారు. సామాన్య ప్రజలకు పెన్షన్ అందిస్తోన్న వాలంటీర్లపై కూటమి కక్ష కట్టిందని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను పనిచేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారన్నారని ఆరోపించారు. నారా భువనేశ్వరి సైకిల్ బ్యాడ్జి పెట్టుకుని చెక్కులు పంపిణీ చేస్తున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు పేర్ని నాని.