Chandrababu: రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వాలంటూ పోలీసులతో బాబు వాగ్వాదం
Chandrababu: రోడ్ షోకు అనుమతి లేదంటూ నోటీసులిచ్చిన పోలీసులు
Chandrababu: రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వాలంటూ పోలీసులతో బాబు వాగ్వాదం
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా సాగింది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని నోటీసు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు. అయితే నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు తనకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పర్యటనను అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దీంతో పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం పెద్దూరు నుంచి ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబు శాంతిపురం మండలంలో ర్యాలీ నిర్వహించారు. కెనమాకుల పల్లెలో రచ్చబండలో పాల్గొన్నారు. రచ్చబండ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించడంతో. గ్రామ వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఓ సైకో అంటూ మండిపడ్డారు. ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.