ఈనెల 8న మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్

Chandrababu: కార్యక్రమాలను స్పీడప్ చేసిన టీడీపీ, జనసేన

Update: 2024-02-05 06:25 GMT

ఈనెల 8న మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ 

Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార వైసీపీ సభలు సమావేశాలతో ముందుకెళ్తుండగా.. ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ రెండుసార్లు సమావేశమయ్యారు. ఉండవల్లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలూ 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అంతకుముందు మధ్యాహ్నం భేటీ అయిన జనసేనాని దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా.. మరోసారి రాత్రి తొమ్మిది గంటలకు సమావేశమయ్యారు. అయితే ఒకేరోజు రెండు సార్లు భేటీ కావడంపై ఏపీలో పొలిటికల్‌ చర్చకు దారి తీసింది.

అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఎక్కడ ఎవరు బరిలో నిలవాలనే అంశంపై ఈ భేటీలో నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పనున్న ఆ పార్టీ అధిష్ఠానం.. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. అలాగే, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి పవన్‌ కల్యాణ్‌ వారికి నచ్చజెప్పనున్నారు. ఇరు పార్టీల ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాత రెండు పార్టీలూ పోటీచేసే స్థానాల సంఖ్య, అభ్యర్థులపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మరి రెండుసార్లు జరిగిన చంద్రబాబు, పవన్‌ల సమావేశం సారాంశమేంటి? అసలు కీలక అంశాలపై స్పష్టత వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉండడం కారణంగా.. సీటు దక్కని వారికి సర్దిచెప్పాలని డెసిషన్ తీసుకున్నారు పవన్. ఇదే విషయంపై క్యాడర్‌కు పరోక్షంగా సంకేతాలిచ్చారు. పొత్తులతో కొంచెం కష్టంగా ఉంటుందని.. సీట్ల సర్దుబాటు కొంతమందికి బాధ కలిగిస్తుందని అన్నారు. టీడీపీతో పొత్తు, సీట్ల అడ్జెస్ట్‌మెంట్‌లో కొన్ని ‎ఇబ్బందులు ఉంటాయన్నారు. నేతలంతా నమ్మకంతో తన వెనుక నడవాలని కోరారు. ఇక రెండోసారి సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించినట్లు సమాచారం. మేనిఫెస్టోను భారీ బహిరంగ సభ ద్వారా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఏయే అంశాలతో మేనిఫెస్టో ఉండాలనే దానిపై ఇద్దరి మధ్య క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా సుదీర్ఘ సమావేశాల అనంతరం సీట్ల సర్దుబాటుపై దాదాపు స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News