సీఎం జగన్ పాలనపై మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2020-05-18 07:16 GMT
Lakshminarayana (File Photo)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఇంట‌ర్యూలో మాట్లాడుతూ.. జగన్ అధిక ఆస్తుల‌ కేసు దర్యాప్తు స‌మ‌యంలో ఆయన తనకు ఎయిర్ పోర్టులో ఎదురుప‌డ్డార‌ని, నమస్కారం అంటే నమస్కారం చేశార‌ని ఆసక్తికర విషయాలు చప్పారు. జగన్ ఆస్తుల కేసులో లక్షకోట్లు ప్రచారం గురించి తనకు తెలియదని, ఆ కేసులో ద‌ర్యాప్తులో తాను చేసినంత వ‌ర‌కు 1500 కోట్ల రూపాయ‌లు చార్జీషిట్ దాఖ‌లు చేశామని తెలిపారు.

సీఎంగా జగన్ ఏడాది పాలనపై ఆయన స్పందిస్తూ.. ముఖ్య‌మంత్రిగా ఏడాది పాలన ఏడాది పూర్తైన తర్వతే మార్కులు ఇస్తాన‌ని అన్నారు. జ‌గ‌న్ సీఎంగా అనేక నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని సాధారణంగా మేనిఫెస్టోలో హామీలు అమ‌లు చేయ‌ర‌ని, కానీ, జ‌గ‌న్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రాధాన్యంగా చేస్తున్నారని కొనియాడారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌సేన‌పార్టీ రాజీనామా, ఆయ‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ‌‌మాట్లాడారు. పవన కళ్యాణ్ ఫుల్ టైం పొలిటిషియ‌న్ కాద‌ని, తాను తాను ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జ‌న‌సేన పార్టీకి రాజీనామా చేసేముందు కారణాలు చెప్పి బయటకు వచ్చానని అన్నారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకులేదని చెప్పారు. రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం తీసుకుంటానని తెలిపారు. వేరే పార్టీ అవసరం అనుకుంటే ఆ దిశగా వెళతానని చెప్పుకొచ్చారు. యువతలో మార్పు తేవాలనే ఉద్దేశమన్నారు.

సీబీఐలో పనిచేసిన సమయంలో చాలా కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేసినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. తన విధుల్ని నిర్వహించానని.. . ఎవరిపైనా కక్షగట్టాల్సిన అవసరం లేదన్నారు. తర్వాత కొన్ని జరిగాయనుకుంటున్నాను అన్నారు. 


Tags:    

Similar News