Pendurthi: పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Update: 2020-03-31 02:27 GMT

విశాఖపట్నం: కరోనా ప్రభావంతో ఎటువంటి పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఇటీవల నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నగరంలోని శంకరమఠం వద్ద 50 మంది బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ వెల్లంకి భానుమూర్తి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.వి.ఎస్.ప్రభాకర్ రావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్, సుసర్ల సర్వేశ్వర శాస్త్రి అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు అధికారుల కాళిదాస్ కిరాణా సామాగ్రిని అందజేశారు. కోపరేటివ్ డైరెక్టర్ వెల్లంకి భానుమూర్తి తో పాటు పలువురు దాతలు ఈ సామాగ్రిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అంబటిపూడి సుధీర్ శర్మ.. సతీష్(రామ్మూర్తి ),బూర్ల సతీష్ పాల్గొనడం జరిగినది.


Tags:    

Similar News