బోటులో 150 లైఫ్ జాకెట్లు.. ప్రమాదానికి కారణం చెప్పిన ఓనర్..

బోటులో 150 లైఫ్ జాకెట్లు.. ప్రమాదానికి కారణం చెప్పిన ఓనర్.. బోటులో 150 లైఫ్ జాకెట్లు.. ప్రమాదానికి కారణం చెప్పిన ఓనర్..

Update: 2019-09-15 11:23 GMT

తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీ సర్కార్.. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తూనే ఉన్నారు. అవసరమైతే నేవీ సహకారం తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరును ఆదేశించారు. కాగా ప్రమాదానికి గురైన లాంచీ కెపాసిటీ 90 మందని.. లాంచీలో 150 లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయని లాంచీ ఓనర్ తెలిపారు. ప్రమాద ప్రదేశంలో సుడిగుండం ఉన్నట్టు తెలిపారు. అక్కడ డ్రైవర్లు సరిగా నడపలేదని.. అలాగే లాంచీ మునిగిన చోట ఫోన్ సిగ్నల్స్ లేవని వెల్లడించారు. ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. బోటులో 61 మంది ప్రయాణికులున్నారు. కాగా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

Tags:    

Similar News