బోటు ప్రమాదంలో 15 మంది వరంగల్ వాసుల గల్లంతు!
బోటు ప్రమాదంలో 15 మంది వరంగల్ వాసుల గల్లంతు బోటు ప్రమాదంలో 15 మంది వరంగల్ వాసుల గల్లంతు
తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక బోటు పున్నమి లాంచ్ మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ దుర్ఘటన జరగగా.. ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. ప్రమాద సమయంలో… బోటులో 61 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 15 మంది దాకా వరంగల్ కు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. లాంచీలో వీరు కూడా పాపికొండల టూరుకు వెళ్లినట్టు సమాచారం.