Kakinada: స్థానిక ఎన్నికల వాయిదాను బీజేపీ స్వాగతిస్తుంది: జీవీఎల్

కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నికలు వాయిదా వేయడం మంచిది. అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఇలా వాయిదా వేయడం చెల్లుబాటు కాదు.

Update: 2020-03-15 14:15 GMT

కాకినాడ: కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను స్వాగతిస్తున్నాం అయితే ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ కూడా రద్దు చేసి తిరిగి మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, వివాదాలను పలు వురు ఎంపీలతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు వివరించాం.

కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నికలు వాయిదా వేయడం మంచిది. అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఇలా వాయిదా వేయడం చెల్లుబాటు కాదు. దీంతో ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించాలి. అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ ముఖ్యమంత్రికి తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా ఖండి స్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన ఉనికి కూడా లేకుండా పూర్తిగా ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ అప్పగించారు.


Tags:    

Similar News