Bhuma Akhila Priya: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. మేం టీడీపీకి రాజీనామా చేసి వస్తాం
Bhuma Akhila Priya: ఎమ్మెల్యే రవికి మాజీ మంత్రి అఖిలప్రియ సవాల్
Bhuma Akhila Priya: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. మేం టీడీపీకి రాజీనామా చేసి వస్తాం
Bhuma Akhila Priya: ఎమ్మెల్యే రవి చేసిన ఆరోపణలపై ఆధారాలతో మీడియా ముందుకు రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి అఖిలప్రియ. కౌన్సిల్ హాల్లో మీ సతీమణి నాగినిరెడ్డి టీడీపీ కౌన్సిలర్లను గొర్రెలు అనడం సరికాదన్నారు. గొర్రెలు అన్నందుకు గాను ఎస్సీ, మైనార్టీలకు నాగిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ దగ్గరికి ఆధారాలు తీసుకురావాలన్నారు అఖిలప్రియ. సవాల్ స్వీకరిస్తావా? లేదంటే క్షమాపణ చెబుతావా? అంటూ ఎమ్మెల్యే రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలప్రియ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రావాలని మేం కూడా టీడీపీకి రాజీనామా చేసి వస్తామని పార్టీలకు అతీతంగా ప్రజల ముందుకు వెళ్దామన్నారు. రాని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.