'ఎస్పీ'పై నోరుపారేసుకున్న అచ్చెన్నాయుడు

Update: 2019-09-11 05:38 GMT

టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పోలీసులపై నోరు పారేసుకున్నారు.. యూజ్ లెస్ ఫెలో అంటూ రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరుకు సిద్దమైన అచ్చెన్నాయుడును శాంతిభద్రతల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు.. అచ్చెన్నకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు 'ఏయ్‌ ఎగస్టా చేయొద్దు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు' అంటూ.. ఎస్పీ విక్రాంత్ పటేల్ ను 'యుజ్‌లెస్ ఫెలో' అని పరుష పదజాలంతో దూషించారు. అంతేకాదు తనను ముట్టుకోవద్దు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News