తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి అంతర రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తెలుగురాష్ట్రాలు దృష్టిసారించాయి.

Update: 2020-06-18 16:05 GMT

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి అంతర రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తెలుగురాష్ట్రాలు దృష్టిసారించాయి. బస్సులు నడపడంపై తెలుగురాష్ట్రాల ఉన్నతాధికారులు గురువారం ప్రాథమిక చర్చలు జరిపారు. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ఈ సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్‌ ప్రారంభించాలని చూస్తున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్‌ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మొదట 256 సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు నడపాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. అయితే దీనిపై మాత్రం ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు. కానీ వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశముందని బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. 


Tags:    

Similar News