ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

Update: 2019-09-12 07:04 GMT

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి ఇటీవల జరిగిన పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్‌ నవాంగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌లు హాజరయ్యారు. ఏపీఎస్పీ, సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

వీరిలో 500 మంది మహిళలున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్‌సైట్లో ఉంచినట్లు హోమ్ శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు రిక్రూట్మెంట్ శాఖ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News