AP High Court: జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై హై కోర్ట్ అసహనం

AP High Court: న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న కేసుపై సీబీఐ దర్యాప్తు పేలవంగా సాగుతోందని హైకోర్ట్ మండిపడింది.

Update: 2021-10-28 15:45 GMT

AP High Court: జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై హై కోర్ట్ అసహనం

AP High Court: న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న కేసుపై సీబీఐ దర్యాప్తు పేలవంగా సాగుతోందని హైకోర్ట్ మండిపడింది. నిందితులపై చర్యల విషయంలో సీబీఐ పనితీరు చాలా నిరాశాజనకంగా ఉందంది రేపు జరిగే విచారణకు సీబీఐ ఎస్పీ రావాలని కోర్ట్ ఆదేశించింది. పంచ్ ప్రభాకర్ అనే ఎన్నారై తరచుగా పెడుతున్న పోస్టులు, వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తెచ్చిన స్టాండింగ్ కౌన్సిల్ అశ్వనీ కుమార్ సోషల్ మీడియా సంస్థలకు నోటీసులిచ్చి కంటెంట్ తొలగించాలని వాదించారు. పంచ్ ప్రభాకర్ పోస్టులు ఏపీ ప్రజల ఆత్మ గౌరవానికి భిన్నంగా ఉన్నాయని కోర్ట్ వ్యాఖ్యానించింది. హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ లలితల ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది.

Tags:    

Similar News