నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది జగన్ సర్కార్. మిగిలిపోయిన గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
ఏపీలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది జగన్ సర్కార్. మిగిలిపోయిన గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. కొన్ని కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిపోయిన పోస్టులను భర్తీ చెయ్యాలని నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నవంబరు 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. అభ్యర్థులు నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. నవంబరు 15 నుంచి అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారని.. ఆ తరువాత నవంబరు 16 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.. ఇందులో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుందని అన్నారు.