Ap govt pensions: ఆగష్టు నుంచి లక్ష మందికి పైగా పెన్షన్లు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Ap govt pensions: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్హులైనవారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆగష్టు నుంచి దాదాపు లక్షమందికి పైగా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పెన్షన్ అందని వారు లబ్ధిదారులగా పేరును నమోదు చేసుకోవచ్చు.

Update: 2025-07-25 07:07 GMT

Ap govt pensions: ఆగష్టు నుంచి లక్ష మందికి పైగా పెన్షన్లు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Ap govt pensions: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్హులైనవారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆగష్టు నుంచి దాదాపు లక్షమందికి పైగా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పెన్షన్ అందని వారు లబ్ధిదారులగా పేరును నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదశే కూటమి ప్రభుత్వం పెన్షన్ దారులకు శుభవార్తను తీసుకొచ్చింది. ఆగష్టు నుంచి కొత్త ఒక లక్షా 9 వేల 155 మందికి పెన్షన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. అర్హులైన వారు ఎవ్వరూ పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదనే ఆలోచనతో ఇప్పుడు మళ్లీ పెన్షన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.

ఈ కొత్త పెన్షన్ వివరాలు ఏంటంటే, ఎవరైనా పెన్షన్ పొందుతున్న భర్తలు చనిపోతే, వారి భార్యలు ఈ పెన్షన్లకు అర్హులు. గతంలో కూడా ఇలాంటి వితంతు పెన్షన్లు ఇచ్చారు. కాదంటే ఇంకా చాలామంది కొత్తవారు ఉండిపోయారు. వారికోసమే ప్రభుత్వం ఇపుడు ఈ నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోతే కచ్చితంగా భార్యకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ప్రతినెలా ఇలా కొత్తగా చనిపోతున్నవారి లిస్ట్‌ని సెలెక్ట్‌ చేసి, వారి భార్యలను ఈ కొత్త పెన్షన్ల లిస్ట్‌లో చేరుస్తారు. వారికి పెన్సన్ వచ్చేలా చేస్తారు. ఆగష్టులో మొదలైన ఈ పెన్షన్ల కింద, ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఇస్తారు. ఇలా ఈ అదనపు వితంతు పెన్షన్ల కోసం రూ.43.66 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏపీ అర్హులైనవారందరికీ పెన్షన్ అందడం లేదు. దానికోసం కూటమి ప్రభుత్వం సర్వేలు జరిపి, ఒక లిస్ట్‌ను ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఏపీలో పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 62,81,768 మంది ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది చనిపోయినవారు, మిస్సింగ్ అయినవారు, విదేశాలకు వెళ్లిపోయినవారు, అందుబాటులో లేని వారు, అనర్హులు దాదాపు 3 లక్షలకు పైనే ఉన్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుంది. వీరందరినీ ఇప్పుడు పెన్షన్ లిస్ట్‌లోంచి తీసేసి... ఆ డబ్బులను ఇప్పుడు వింతతు పెన్షన్ల కింద ఇవ్వాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది.

Tags:    

Similar News