ఎవరిని బెదిరిస్తున్నారు.. ఇష్టానుసారం మాట్లాడతారా : శ్రీకాంత్ రెడ్డి

Update: 2019-09-17 06:15 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతికి.. చంద్రబాబు, కోడెల కుటుంబసభ్యులే కారణమని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. కుటుంబసభ్యుల అవినీతి ఆయనను బాధించిందని అన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆదరణ కరువైందని.. దాంతో కోడెల కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు శ్రీకాంత్ రెడ్డి. కోడెల చనిపోయారన్న బాధలేకుండా చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. ఒక సీనియర్ నేత చనిపోతే బాధపడాల్సిపోయి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడెల మృతికి వైసీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.

ఈ విషయంలో ఎవరిని బెదిరిస్తున్నారు.. కోడెలపై కేసులు నమోదయ్యే సమయంలో మాట్లాడకుండా.. ఆయన చనిపోయాక రాజకీయం చేయడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు. తమరి హయాంలో ఎన్నో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి వాటన్నిటికీ సమాధానం ఎందుకు చెప్పలేదన్నారు. కోడెల మృతిని అడ్డం పెట్టుకొని ఫోర్జరీ కేసులో ఇరుకున్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని, అక్రమ మైనింగ్ కేసులో చిక్కుకున్న యరపతినేని శ్రీనివాసరావు, దళితులను దూషించిన చింతమనేని, నన్నపనేని రాజకుమారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే మాజీ లాల్ జాన్ బాషా, మాజీ స్పీకర్ బాలయోగి మృతిచెందారని ఆరోపించారు. 

Tags:    

Similar News