AP IPS Transfers: ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు..భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Update: 2025-01-21 02:14 GMT

AP IPS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు బదీలు జరిగాయి. ఏపీ సర్కర్ సడెన్ గా ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఏకంగా 27 మందిని బదిలీ చేస్తూ..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీగా ఎస్ మధుసూదన్ రెడ్డిని బదిలీ చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ గా ఆర్కే మీనాను నియమించగా.. ఆపరేషన్స్ ఐజీపీగా సీహెచ్ శ్రీకాంత్ ను నియమించారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా రాజ్ కుమారిని నియమించారు. ఏపీ ఫొరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా పాలరాజును నియమించారు. కాకినాడ ఎస్పీగా బిందుమాధవ్, కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్ రానున్నారు.

తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు శ్రీవారి భక్తులు మరణించడంతో తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. సుబ్బరాయుడిని ఎర్రచందనం యాంటీ టాక్స్ ఫోర్స్ ఎస్పీగా బదిలీచేశారు. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు రానున్నారు. 




 


Tags:    

Similar News