Atmakur: ఆత్మకూరులో అమరావతి సంబరాలు హోరెత్తిన బైక్ ర్యాలీ, బాణసంచా సందడి!

Atmakur: అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఆత్మకూరులో టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.

Update: 2026-04-03 07:15 GMT

Atmakur: ఆత్మకూరులో అమరావతి సంబరాలు హోరెత్తిన బైక్ ర్యాలీ, బాణసంచా సందడి!

ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా బాణాసంచా పేల్చారు అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బస్టాండ్ సెంటర్ నుండి ఆర్టీసీ డిపో వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పట్టణంలోని అన్నా క్యాంటీన్ ప్రాంగణం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ 2014లో టిడిపి అధికారంలోకి రాగానే ఆంధ్రుల రాజధాని అమరావతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 35వేల ఎకరాలను రాష్ట్ర రాజధాని అమరావతికి ఇచ్చారని అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారు అన్నారు. 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ మాట మార్చి మూడుముక్కలాట ఆడారన్నారు. ఇది వారి నీచ బుద్ధికి నిదర్శనం అన్నారు.ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు ఆమోదించడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఐవి రమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు రెండు కళ్ళు అన్నారు. అమరావతి కల సహకారమైందని త్వరలో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయి రాష్ట్రం తో పాటు పక్క రాష్ట్రాలకు కూడా నిరంధించి సస్యశ్యామలం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News