Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం

Water Issue: అనుమతుల్లేకుండా విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడుతున్నారని వాదన * ఖరీఫ్‌ పంటకు నీరు అందించలేమంటూ ఆందోళన

Update: 2021-07-05 03:48 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ (ఫైల్ ఇమేజ్)

Water Issue: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్‌ వార్‌ తారాస్థాయికి చేరుకుంటోంది. తెలంగాణ జెన్‌కో నిబంధనలు ఉల్లంఘిస్తోందంటున్న ఏపీ ప్రభుత్వం.. అనుమతులు లేకుండా విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడుతున్నారని ఆరోపిస్తోంది. ఈ విధంగా.. తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడటం ద్వారా.. ఖరీఫ్‌ పంటకు నీరు అందించలేమని ఆందోళన వ్యక్త పరుస్తోంది ఏపీ సర్కార్. వివాదంపై కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ రాయగా.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మంత్రులు హామీ ఇచ్చారు.

మరోవైపు.. పులిచింతల, నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాంల వద్ద ఇరురాష్ట్రాల పోలీస్‌ పహారా కొనసాగుతోంది. చుక్క నీరు కూడా పోనీయకుండా చూస్తామని రెండు ప్రభుత్వాలు సవాళ్లకు దిగుతున్నాయి. ఇప్పటికీ.. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తోంది తెలంగాణ జెన్‌కో. దీంతో.. డ్యాంపై రాకపోకలు నిలిపివేశారు. మరోపక్క.. నీటి వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులవి డ్రామాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

Full View


Tags:    

Similar News