Andhra Pradesh: ఏపీలో కౌలు రైతులకూ భరోసా

Andhra Pradesh: ఇప్పటివరకు యజమానులుగా ఉన్న రైతులకు మాత్రమే అందుతున్న భరోసా.. ఇకపై కౌలు రైతులకు అందనున్నది

Update: 2021-06-12 06:24 GMT

సీఎం జగన్ (ఫైల్ ఫోటో) 

Andhra Pradesh: ఇప్పటివరకు యజమానులుగా ఉన్న రైతులకు మాత్రమే అందుతున్న భరోసా.. ఇకపై కౌలు రైతులకు అందనున్నది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం భూములు కౌలు రైతుల కిందే ఉన్నది. అయితే వారికి హక్కు పత్రాలు లేకపోవడంతో.. వ్యవసాయానికి ప్రభుత్వం అందించే సాయం అందుకోలేకపోతున్నారు. అందువలన కౌలురైతులకు హక్కు పత్రాలను అందించేందుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన సర్కారు ఈ నెల 30వ తేదీ వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల దగ్గర సీసీఆర్‌సీ మేళాలను నిర్వహిస్తోంది.

పంట సాగుదారు హక్కు పత్రాల (CCRC) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గడచిన రెండేళ్లలో 6,87,474 మందికి సీసీఆర్‌సీలు జారీ చేయగా, 2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి వాటిని జారీ చేయాలని నిర్ణయించింది. వీరందరికీ నిబంధనల ప్రకారం రైతు భరోసా, రాయితీపై విత్తనాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర వంటి ప్రయోజనాలను వర్తిస్తాయి. సీసీఆర్‌సీ పత్రాలపై సంతకం చేసే విషయంలో భూ యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు హామీ ఇస్తున్నారు. 11 నెలల కాలంలో పండించిన పంటపై తప్ప.. భూమిపై కౌలుదారులకు ఎలాంటి హక్కులు ఉండవంటున్నారు.

Tags:    

Similar News