AP Free Lands for Poor: గుడ్ న్యూస్.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్దం
AP Free Lands for Poor: ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలను అమలు చేస్తూ వస్తుంది.
AP Free Lands for Poor: గుడ్ న్యూస్.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎపీ సర్కార్ సిద్దం
AP Free Lands for Poor: ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తాజాగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్దం అయింది. దీనికోసం జీవీ నెంబర్ 23ని జారీ చేసింది. దీనికోసం ఏర్పట్లు మొదలుపెట్టింది.
మొన్న తల్లికి వందనం, నిన్న అన్నదాత సుఖీభవ, నేడు పేదలకు ఇళ్ల స్థలాలు... ఇలా ఒక్కొక్కటి ప్రజలకు అందిస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అర్హత ఉన్న ప్రతి లబ్ధి దారుల కుటుంబాలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలలో అయితే 2 సెంట్లు వరకు స్థలాన్ని పభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. అర్హతలున్న ప్రతి కుటుంబానికి ఈ ఇళ్ల స్థలాలు రానున్నాయి.
స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. అంతేకాకుండా పేదలు ఇళ్లు నిర్మించేందుకు పీఎం ఆవాస్ యోజన పథకం కూడా ఉండనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏపీలో కలిపేందుకు ప్లాన్ చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వ పథకంతో పాటు రాష్ట్ర పభుత్వ పథకం కూడా కలిపి ఇళ్లను నిర్మించనున్నారు.
గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం, అంతకుముందు వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఈ రెండూ కూడా వేల ఇళ్లను ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లయితే సంగంలోనే ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దానిని పూర్తి చేయలేదు. కానీ మరికొన్ని ఇళ్లస్థలాలను మాత్రం వైఎస్సార్ ఇళ్లుగా సాంక్షన్ చేయించారు. ఇందులో కొన్ని లభ్ధిదారులకు అందాయి. మరికొన్ని అందాల్సి ఉంది. ఆ తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అవి కూడా నిలిచిపోయాయి. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇళ్ల స్థలాలు సరిగా ప్రజలకు అందలేకపోయాయి.