AP Deputy CM Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులతో సత్రం, అతిథిగృహానికి శంకుస్థాపన కొండగట్టు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్న పవన్

Update: 2026-01-02 10:55 GMT

AP Deputy CM Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం‎ పవన్ కళ్యాణ్ రేపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న సత్రం, అతిథి గృహాలు, దీక్షా మండపానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. హెలికాప్టర్‌‌లో ఆయన కొండగట్టుకు చేరుకుంటారు. రెండు గంటల పాటు పవన్ పర్యటన కొనసాగనుంది.

Tags:    

Similar News