Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను చంపేస్తాం..పవన్ పేషీకి బెదిరింపు కాల్స్

Update: 2024-12-09 14:43 GMT

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని దుండుగుల నుంచి వచ్చిన కాల్స్ లో పవన్ కల్యాణ్ ను చంపేస్తామని హెచ్చరించినట్లు ఆయన పేషీ సిబ్బంది తెలిపారు. అంతేకాదు అభ్యంతరకర భాషలో మెసేజ్ లు పంపించారు. ఈ విషయాన్ని సిబ్బందికి పవన్ కు చేరవేయగా...ఆయన ఉన్నతాధికారులకు తెలియజేశారు.

బెదిరింపు కాల్స్ పై రావడంపై హోంశాఖ మంత్రి అనిత వెంటనే స్పందించి డీజీపీతో మాట్లాడి నిందితుడికి త్వరగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ హోంమంత్రి అనితక తెలిపారు. ఆగంతకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని హోంమంత్రి ఆదేశించారు.

గతంలోనూ పవన్ కల్యాణ్ కు ఇలాంటి తరహా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News