రఘురామ వైద్య పరీక్షల నివేదికపై హైకోర్టులో వాదనలు పూర్తి.. కీలక ఉత్తర్వులు

Raghu Rama: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Update: 2021-05-16 14:45 GMT

 రఘురామకృష్ణరాజు ఫైల్ ఫోటో 

Raghu Rama: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మరి కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు ఎంపీ రఘురామను గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

రఘురామను కోర్టు అనుమతి లేకుండా జైలుకు తరలించారంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకు జైలులో ప్రాణ హాని ఉందని ఆయన తరపున న్యాయవాది వాదించారు. హైకోర్టు ఆదేశాలతో పాటు సీఐడీ ఆదేశాలను కూడా ప్రభుత్వం బేఖాతర్ చేసిందని పేర్కొన్నారు. అయితే రఘురామ తరపు న్యాయవాది వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని రఘురామ తరపున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

కాగా..గుంటూరు జీజీహెచ్‌ నుంచి ఎంపీ రఘురామ కృష్ణరాజును జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు.. సీల్డ్‌ కవర్‌లో మెడికల్‌ రిపోర్టును జిల్లా కోర్టుకు సమర్పించారు. రఘురామ మెడికల్‌ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గుంటూరు జిల్లా జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.


Tags:    

Similar News