ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు వైసీపీ నిర్ణయం

AP News: ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్‌, సి.రామచంద్రయ్యపై ఫిర్యాదు

Update: 2024-01-08 14:00 GMT

ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు వైసీపీ నిర్ణయం

AP News: పార్టీ లైన్ క్రాస్ చేసిన నేతలపై వైసీపీ సీరియస్‌ యాక్షన్‌కు సిద్ధమైంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుకు నిర్ణయం తీసుకుంది. పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను.. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో పాటు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్‌, సి.రామచంద్రయ్యపై చర్యలకు రంగం సిద్ధం చేసింది వైసీపీ. ఈ ఐదుగురు నేతలను అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News