Jagan Review: వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
*మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం *భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
Jagan Review: ఏపీలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఐదు జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో చర్చించారు.