విశాఖ ఉత్సవ్‌ ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించారు

Update: 2019-12-28 14:18 GMT
Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించారు. రెండు రోజుల పాటు ఆర్‌కే బీచ్‌లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా . థాంక్యూ సీఎం జగన్ అనే నినాదంలో విశాఖ తీరం హోరెత్తింది. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కరించారు. నవరత్నా పథకాలు వివరిస్తూ..లేజర్ షో ప్రదర్శించారు.

స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స, పాల్గొన్నారు. విశాఖ ఉత్సవ్‌ రెండు రోజుల పాటు జరగనుంది. 

Tags:    

Similar News