CM Chandrababu: ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం?
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి కీలక సమావేశం జరగనుంది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి కీలక సమావేశం జరగనుంది. అన్ని శాఖల హెచ్‌వోడీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. GSDP లక్ష్యాలు, RTGS ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఈ భేటీకి అన్ని శాఖల మంత్రులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన సూచనలు జారీ అయ్యాయి. ఈ సమావేశం వర్చువల్ మోడ్‌లో నిర్వహించనున్నారు.