AP: ఏపీ అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు వైద్యరంగం, శాంతిభద్రతలపై చర్చలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమై, రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
AP: ఏపీ అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు వైద్యరంగం, శాంతిభద్రతలపై చర్చలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమై, రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా వైద్యరంగం, శాంతిభద్రతలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మెడికల్ కాలేజీల వివాదంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సభలో వివరణ ఇవ్వనున్నారు. అలాగే పలు ప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇక స్వల్పకాలిక చర్చలో రాష్ట్రంలో వైద్య రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆరోగ్యరంగంలో జరుగుతున్న మార్పులు, భవిష్యత్‌లో చేపట్టబోయే చర్యలపై ముఖ్యమంత్రితో పాటు పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. రైతు సంక్షేమానికి సంబంధించి పొగాకు, మిరప, మామిడి వంటి పంటలకు మద్దతు ధర కల్పనపై సభలో చర్చ జరగనుంది. విజయనగరం నియోజకవర్గంలో ఇంకా పరిష్కారం కాని ఇంకుడు గుంతల సమస్య, ఆడబిడ్డ నిధి పథక అమలు, వైజాగ్ అప్పారెల్ పార్క్‌లో ఏర్పాటు కానున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌పై కూడా సభలో చర్చించనున్నారు.
అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, ఆరోగ్య సేవల విస్తరణ, వ్యక్తిగత మరియు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలను కూడా సభ్యులు లేవనెత్తనున్నారు. మొత్తం మీద, నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అనేక కీలక అంశాలపై చర్చలతో సజావుగా కొనసాగనున్నాయి.