తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మరో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో మూడు, పోలవరం ఒక మృతదేహాలు లభించాయి. మిగిలిన మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 16 మృతదేహాలు లభించగా, మరో 30 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే దొరికిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాల గోదావరిలో గాలిస్తున్నాయి. ఇందుకోసం చత్తీస్‌గఢ్, గుజరాత్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించింది రాష్ట్ర ప్రభుత్వం.