ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు

కరోనా మహమ్మారి ప్రపంచలోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కట్టుదిట్టం చేశాయి.

Update: 2020-03-24 16:51 GMT
Representational Image

కరోనా మహమ్మారి ప్రపంచలోని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. గుంపులుగుంపులుగా బయటకు రావొద్దని, కుటుంబ నుంచి ఒక్కరే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకుడదని వెల్లడించారు. ఇక వీటిని పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక ప్రజలు కూడా నిత్యావసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయి వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ లో మరో కారోనా పాజిటివ్ కేస్ నిర్ధారణ (చిత్తూరు జిల్లా) లండన్ నుండి శ్రీకాళహస్తి వచ్చిన యువకుడికి నిర్ధారణ రాష్ట్రంలో ఎనిమిది కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 


Tags:    

Similar News