అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాలకు న్యాయం : గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌

Update: 2020-01-26 06:04 GMT

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ తన రిపబ్లిక్ డే సందేశాన్ని ఇచ్చారు..

అందులో అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని చెప్పారు.. నామినేటెడ్‌ పోస్టుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు గవర్నర్‌ చెప్పారు.

Tags:    

Similar News