ప్రభుత్వం అనుమతిస్తే 24 గంటల్లో ఆర్టీసీ సర్వీసులు

లాక్‌డౌన్‌ నాలుగో దశ సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Update: 2020-05-18 08:29 GMT
Perni Nani (File Photo)

లాక్‌డౌన్‌ నాలుగో దశ సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయం పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బస్సులు నడపడంపై సీఎం జగన్‌ మోహన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే 24 గంటల్లో రాష్ట్రంలో బస్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో పొరుగు సేవల ఉద్యోగులను తొలగించట్లేదని స్పష్టం చేశారు.

ఏపీలో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవ‌ర్ల‌కు రెండో విడ‌త ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి పేర్నీనాని వెల్ల‌డించారు. 'వాహన మిత్ర'కింద వారంద‌రికి సాయం చెస్తున్న‌ట్ల ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం వైఎస్ జగన్ జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలిపారు. సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ జీవ‌నం సాగిస్తున్న‌వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

Tags:    

Similar News