కడప జైలును సందర్శించిన హోంమంత్రి సుచరిత

రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

Update: 2020-02-29 06:16 GMT
హోంమంత్రి మేకతోటి సుచరిత

కడప: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కడప కారాగారంలో స్కిల్ డెవవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను హోంమంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 4 కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌కు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఇలాంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ స్విట్జర్లాండ్‌లో మాత్రమే ఉంది. దేశంలోనే మొదటిసారిగా కడప జైలులో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాం. జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తాం. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.


Tags:    

Similar News