వైసీపీ ఎంపీ సహా 49 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు..

హైకోర్టు జడ్జిలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

Update: 2020-05-26 13:22 GMT
Andhra Pradesh High Court (File Photo)

హైకోర్టు జడ్జిలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ విషయమై ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచితో పాటు 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జడ్జిలను కించపరిచారంటూ వీరిపై ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులపై వారు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు పరిశీలించింది. కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టింది. అనంతరం నోటీసులను జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును పలువురు వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శించారు.


Tags:    

Similar News