ఏపీ హైకోర్టులో విద్యుత్ బిల్లుల పిటీషన్ పై విచారణ వాయిదా

ఏపిలో విద్యుత్ బిల్లులు మార్చి, ఏప్రిల్ రెండు నెలలకు కలిపి ఒకే బిల్లు ఇవ్వటం నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టులో వేసిన పిటీషన్ పై దాఖలైంది.

Update: 2020-05-20 13:15 GMT

ఏపిలో విద్యుత్ బిల్లులు మార్చి, ఏప్రిల్ రెండు నెలలకు కలిపి ఒకే బిల్లు ఇవ్వటం నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టులో వేసిన పిటీషన్ పై దాఖలైంది. ఇవాళ ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏబిసి టారీఫ్ యూనిట్ లలో పలు మార్పులు చేశారని, దాని కారణంగా ఇళ్లకు వచ్చే బిల్లులు విపరీతంగా పెరిగాయని పిటీషనర్ తరుపున వాదనలు వినిపించారు. కొత్త నిబంధనలు ఏప్రెల్ 1 నుంచి రావాలని న్యాయవాది బిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం నెలకు ఒకసారి విద్యుత్ బిల్లు ఇవ్వాలని, రెండు నెలలకు ఒక బిల్లు ఇవ్వడం వల్ల స్లాబ్ మారిపోయి కొత్త రేట్లు వచ్చాయని బిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. ఒక బిల్లు ఇచ్చేటప్పుడు పాత స్లాబ్, కొత్త స్లాబ్ విడివిడిగా లెక్క వేసి ఇచ్చే పద్దతి బిల్ మిషన్ లో లేదని కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వ తరపు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ రావు పిల్ కు విచారణార్హత లేదని వాదించారు. కాగానే.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జి, ఏపి ప్రభుత్వం, ఏపి ట్రాన్స్ కో, ఏపి జన్ కో, ఏపిఎస్పిడిసిఎల్, ఏపిఇపిడిపిఎల్, ఏపిఇఆర్పి లకు మూడు వారాల్లోపు కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 

Tags:    

Similar News