గవర్నర్ ప్రసంగం వీడియో ద్వారానే? కరోనా నేపథ్యంలో ఏపీలో కొత్త సంప్రదాయం

Update: 2020-06-14 02:15 GMT
ap assembly (file image)

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్ననేపథ్యంలో గతంలో ఎన్నడూ చోటుచేసుకోని వింతలు, విడ్డూరాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ నేరుగా సభను ఉద్ధేశించి మాట్లాడాల్సి ఉండగా, కరోనా కారణంగా వీడియో ద్వారా ప్రసంగం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ విధమైన పద్ధతిలో జరగకపోవడం విశేషం.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 16 నుండి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే రోజు ఉద‌యం 10గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించాల్సి ఉంది.

అయితే, రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ప‌రిస్థితుల దృష్ట్యా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం నేరుగా జ‌ర‌గ‌బోద‌ని, వీడియో ప్ర‌సంగం ద్వారా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడ‌బోతున్నార‌ని ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం ప్ర‌క‌టించారు. ఇక స‌భ‌లో 60ఏళ్ల‌కు పైబ‌డిన స‌భ్యులు స‌భ‌కు హ‌జ‌రు కావాలా…? వ‌ద్దా…? అనేది స‌భ్యుల‌కే వ‌దిలేస్తున్నామ‌ని, అధికారికంగా తాము ఎవ‌రిని వ‌ద్ద‌న‌మ‌ని స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

ఇలా గ‌వ‌ర్న‌ర్ వీడియో ద్వారా ప్ర‌సంగించ‌టం చాలా అరుద‌ని, రాష్ట్రంలోనే గ‌వ‌ర్న‌ర్ ఉన్న‌ప్ప‌టికీ ఇలా ప్ర‌సంగించ‌టం గ‌తంలో లేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే… రాష్ట్రంలో కరోనా వైర‌స్ ప్ర‌భావం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని అన్ని ప‌క్షాలు స్వాగించే అవ‌కాశం ఉంది

Tags:    

Similar News