వలసకూలీలకు భారీ ఊరట.. సురక్షితంగా వారి స్వస్థలాలకు

రాష్ట్రంగుండా వెళ్తున్న వలసకూలీలకు భారీ ఊరట లభించింది.

Update: 2020-05-17 06:20 GMT

రాష్ట్రంగుండా వెళ్తున్న వలసకూలీలకు భారీ ఊరట లభించింది. సీఎం ఆదేశాలతో వారికి సహాయంగా చర్యలు ప్రారంభించింది. ఉచితంగా రవాణా, భోజన సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది. శనివారం ఒక్కరోజే శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాల నుంచి సుమారు 900 మంది కూలీలను సురక్షితంగా వారి రాష్ట్రలకు ప్రభుత్వం పంపించింది.

ఇవాళ గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచి మరో 500 మందిని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ప్రయాణం సాఫీగా సాగేలా అటు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అధికారులు మాట్లాడారు. రాయచూరులో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే ప్రక్రియ శనివారం ఆరంభమైంది. బిహార్‌కు చెందిన కార్మికులకు రాయచూరు బస్టాండ్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని బస్సుల ద్వారా కలబురగికి పంపారు.




Tags:    

Similar News