ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...

ఏపీలో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవ‌ర్ల‌కు రెండో విడ‌త ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి పేర్నీనాని వెల్ల‌డించారు.

Update: 2020-05-18 08:01 GMT
YS Jagan(File photo)

ఏపీలో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవ‌ర్ల‌కు రెండో విడ‌త ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి పేర్నీనాని వెల్ల‌డించారు. 'వాహన మిత్ర'కింద వారంద‌రికి సాయం చెస్తున్న‌ట్ల ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం వైఎస్ జగన్ జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలిపారు. సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ జీవ‌నం సాగిస్తున్న‌వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

వైయస్ఆర్ వహనా మిత్రా పథకంలో రూ .10,000 / - చొప్పున 2,36,344 మందిని గుర్తించడం జరిగిందన్నారు. లబ్ధిదారులలో 54,485 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు, 1,05,932 మంది బీసీ వర్గానికి చెందినవారు, 1,30,931 మంది ఓసీ కేటగిరీకి చెందినవారు, 27,107 మంది కాపు వర్గానికి చెందినవారు, 8,762 మంది ఎస్టీ వర్గానికి చెందినవారు, 25,517 మంది మైనారిటీ వర్గానికి చెందినవారు, 509 మంది బ్రహ్మాణ వర్గానికి చెందినవారు మరియు 931 క్రైస్తవ సమాజానికి చెందినవారు ఉన్నారు.

సామాజిక ఆడిట్ ప్రయోజనం కోసం ఉన్న లబ్ధిదారులను ది 18-05-2020 నుండి 26-05-2020 వరకు ఇప్పటికే ఉన్న జాబితా, బదిలీ చేయబడిన వాహనాల జాబితా, కొత్ వాహనాల జాబితా గ్రామ/వార్డ్ సచివాలయం కార్యాలయములలో నోటీసు బోర్డు నందు, గ్రామ/వార్డ్ కార్యదర్శి ల వద్ద వుంచబడును

దరఖాస్తు స్వీకరణ , దృవీకరణ మరియు దరఖాస్తుల అప్లోడ్ , ( మార్పులు చేర్పులు మరియు తొలగింపులతో సహా ది.18-05-2020 నుండి 28-05-2020 వరకు ఏదైనా ఉంటే ) 30-05-2020 వరకు చేపడుతున్నట్లు తెలిపారు. MPDO / మునిసిపల్ కమీషనర్ల ఆమోదం తిరస్కరణ ది 30-05-2020 వరకు చేపట్టడం జరుగుతుందన్నారు. అర్హతగల లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ల నుండి మంజూరు ఉత్తర్వులు 01-06-2020 న జారీ చెయ్యడం జరుగుతుందన్నారు.

02-06-2020 నుండి 043-06-2020 వరకు చెల్లింపులు చేయడానికి సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్ల , మండల ప్రజా అభివృద్ధి అధికారిలచే ఉత్తర్వులు జారీ చెయ్యడం జరుగుతుందన్నారు. ది.04-06-2020 న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిచే లబ్దిదారులందరికి ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. 


Tags:    

Similar News