విశాఖ ఘటన జరిగినప్పుడు అదే గుర్తు వచ్చింది : సీఎం జగన్

విశాఖ విషవాయువు లీకేజీ దుర్ఘనలో కేవలం 12 మందికి మినహా మిగిలిన బాధితుల ఖాతాల్లో పరిహారం వేసినట్లు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Update: 2020-05-18 08:51 GMT
YS Jagan (File Photo)

విశాఖ విషవాయువు లీకేజీ దుర్ఘనలో కేవలం 12 మందికి మినహా మిగిలిన బాధితుల ఖాతాల్లో పరిహారం వేసినట్లు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా బాధాకరమన్నారు. విశాఖ బాధితులకు పరిహారం అందించే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీన్ జగన్ విశాఖ వంటి దుర్ఘటనలు జరిగితే గత ప్రభుత్వాలు ఎలా స్పందించాలో చూశానన్నారు.

ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదంటే ఏ స్థాయిలో ఉండాలంటే, కంపెనీల మనసులో ఉండిపోవాలని ఆనాడే చెప్పినట్లు తెలిపారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇతర దేశాల్లో జరిగితే కంపెనీలకు షాక్ కొట్టేలా పరిహారం అందజేస్తారని చెప్పారు. అందుకే అప్పట్లోనే తాను రూ. కోటి డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఘటన జరిగినప్పుడు అదే గుర్తు వచ్చిందని, అందుకే వెంటనే రూ. కోటి పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు.

2014లో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి ఓ గ్రామం తగులబడినప్పుడు 22 మంది కాలిపోయి చనిపోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో బాధిత గ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలో అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అప్పట్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఓఎన్జీసీ కంపెనీ రూ. 20 లక్షలు, కేంద్రం రూ. 3 లక్షలు, రాష్ట్రం రూ. 2 లక్షల చొప్పున.. మొత్తం 25 లక్షలు పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. 


Tags:    

Similar News