పది రోజుల్లో రేషన్ కార్డు, సరుకులు.. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Update: 2020-06-09 08:02 GMT
YS Jagan (File Photo)

ఏపీలో కొత్తగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇంతవరకు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వం వీటి నుంచి పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తాజాగా ప్రభుత్వ సేవలు నిర్ధిష్ట కాలంలో అర్హులకు అందేంచే కార్యక్రమానికి మంగళవారం ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. భవిషత్తులో అన్ని కార్యక్రమాలు ఈ వ్యవస్థ ద్వారా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. శాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం పేర్కొన్నారు. పది రోజుల్లోనే రేషన్ కార్డులు మంజూరు చేసి బియ్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.

20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం చెప్పారు. 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెన్షన్లు పెంచామని గుర్తు చేశారు. అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన చెప్పారు. 


Tags:    

Similar News