ఆ లింక్‌లను ఓపెన్ చేయొద్దు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీ కేర్‌ఫుల్
కోవిడ్19 పేరుతో వచ్చే సమాచారం సెల్‌ఫోన్లకు వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దని ఏపీ ప్రజల్ని సీఐడీ హెచ్చరించింది.
కోవిడ్19 పేరుతో వచ్చే సమాచారం సెల్‌ఫోన్లకు వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దని ఏపీ ప్రజల్ని సీఐడీ హెచ్చరించింది. ఈ మేరకు సైబర్ నేరాల సెల్ ఎస్పీ రాధిక సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు నంబర్లు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కొట్టేసేందుకు సైబర్ కేటుగాళ్లు ఈ లింక్‌లు పంపిస్తున్నారని, ఇలాంటివి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనా సమాచారం పేరుతో సైబర్ దాడులు జరిగే అవకాశముందని సీబీఐ అప్రమత్తం చేసిందట. అయితే ప్రస్తుతం సైబర్ నేరస్థులు 'సెర్బెరస్' అనే బ్యాంకింగ్ ట్రోజాన్‌ను మొబైల్స్‌కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఆ లింక్‌లను ఫోన్‌లలో ఉంచితే క్రెడిట్, డెబిట్‌కార్డుల డేటాను చోరీ చేసి డబ్బులు కొట్టేస్తారని హెచ్చరిస్తున్నారు. కొద్దిరోజులుగా కొంతమంది తమ సమస్యల్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ పోలీసులు ప్రజల్ని అలర్ట్ చేశారు. లాటరీలు, ప్రైజ్‌లు గెలచుకున్నారంటూ.. వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దని పోలీసులు సూచించారు. పొరపాటున కూడా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వొద్దని అలర్ట్ చేశారు.